ప్రముఖ పారిశ్రామికవేత్త రేమండ్స్ అధినేత (Reymonds Chairman) గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ నుంచి విడాకులు తీసుకున్నారు. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వారి విడాకుల విషయం హల్ చల్ చేస్తున్నా సింఘానియా స్పందించలేదు. తాజాగా భార్యతో విడాకుల విషయాన్ని సింఘానియా స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఫిట్నెస్ ట్రైనర్ నవాజ్‌ను 1999లో సింఘానియా ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. థానేలో సింఘానియా ఏర్పాటు చేసిన దీపావళి వేడుకలకు నావాజ్ను అనుమతించలేదన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన గంటల వ్యవధిలోనే ఆయన స్పందించారు.
24 సంవత్సరాలుగా నిబద్దత, విశ్వాసంతో పయనించాం. మా జీవితాలకు రెండు అందమైన అద్భుతాలు జతయ్యాయి. ఇటీవల కొన్ని దురదృష్ణకర సంఘటనలు జరిగాయి. నిరాధార ఆరోపణలను కొందరు వ్యాపింపజేశారు. వారు మా శ్రేయేభిలాషులు కాదు. ఇక నుంచి తాను నవాజ్ వేర్వేరు దారులను అన్వేషించగలమని విశ్వసిస్తున్నట్లు సింఘానియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో వారి విడాకుల వార్తలు నిజమేనని తేలిపోయింది. వారు విడిపోవడానికి కారణాలను మాత్రం ప్రస్తావించలేదు.