ఒబెరాయ్ హోటల్స్ ఛైర్మన్ పృథ్వీరాజ్‌సింగ్ ఒబెరాయ్ (PRS Oberoi) మంగళవారం మరణించారు. వృద్దాప్య సమస్యలతో 94 ఏళ్ల వయసులో మంగళవారం ఉదయం చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ప్రపంచ ఆతిథ్యరంగంలో తనదైన ముద్రవేసి ఒబెరాయ్ ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఒబెరాయ్ చేసిన సేవలకు అనేక అవార్డులు వరించాయి. మరెన్నో ప్రశంసలు అందుకున్నారు. పర్యాటకరంగంలో ఒబెరాయ్ చేసిన సేవలకు గుర్తింపుగా పద్మవిభూషన్ పురస్కారం అందించారు. ఒబెరాయ్ అసాధారణ నాయకత్వపటిమకు గుర్తుగా ఇంటర్నేషనల్ లగ్జరీ ట్రావెల్ నుంచి జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు.
ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డు అందుకున్నారు. ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్, సీఎన్‌బీసీ టీవీ 18 ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్, బిజినెస్ ఇండియా మ్యాగజైన్ నుంచి బిజినెస్మెన్ ఆఫ్ ద ఇయర్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను అందుకున్నారు.
మంగళవారం సాయంత్రం ఢిల్లీ సమీపంలో కపషేరాలోని ఒబెరాయ్ ఫామ్‌లో భగవంతి ఒబెరాయ్ ఛారిటబుల్ ట్రస్ట్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి.