ఎన్టీఆర్
జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సరదగా ఈతకు వెళ్ళిన యువకులు ప్రమాదవశాత్తు నీట
మునిగి చనిపోయారు. కంచికచర్ల మండలంలోని కీసర వద్ద మున్నేరులో ఈ దారుణ ఘటన
చోటుచేసుకుంది.
ఐదుగురు స్నేహితులు నీళ్ళలోకి దిగారు. లోతు తెలియక నీటిలో
మునిగిపోయారు. వారి కేకలు విని అక్కడికి చేరుకున్న స్థానికులు రక్షించే ప్రయత్నం
చేశారు. అప్పటికే ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా
ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతులు
నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన చేజర్ల దినేశ్, యడవల్లి గణేశ్, గాలి సంతోష్
గా గుర్తించారు. యువకుల మరణంతో వారి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబ
సభ్యులు తల్లడిల్లుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి
చేరుకున్నారు. కేసు నమోదు చేసి ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు.