దేశీయ
స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు నేడు నష్టాల్లో
ముగిశాయి. ఉదయమే ప్రతికూలత ఎదుర్కోన్న మార్కెట్లు రోజంతా అదే రీతిలో కొనసాగాయి. ఏ
దశలోనూ సూచీలకు కొనుగోళ్ల అండ దొరకలేదు.
సెన్సెక్స్
(Sensex )325 పాయింట్లు
క్షీణించి 0.50 శాతం తగ్గి 64,933.87 వద్ద ముగిసింది. నిఫ్టీ(Nifty) 82 పాయింట్ల
నష్టపోయి 0.42 శాతం కుంగి, 19,443.50 వద్ద ముగిసింది.
మార్కెట్లు
ముగిసే సమయానికి డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.32 వద్ద నిలిచింది.
సెప్టెంబర్ త్రైమాసికంలో గ్లెన్మార్క్ ఫార్మా
ఫలితాలు అంచనాలను అందుకోలేదు. దీంతో రూ. 61.6 కోట్లు నష్టపోయింది. సిగాచీ
ఇండస్ట్రీస్ షేరు విలువ ఇంట్రాడేలో 4.32 శాతం పెరిగి నుంచి రూ. 51.9 చేరింది. గత
ఆరు సెషన్లలో కంపెనీ షేరు విలువ 24 శాతం పెరిగింది.