ఏలూరు
జిల్లా కొయ్యలగూడెంలో దారుణ ఘటన
చోటుచేసుకుంది. ఓ బైకును డీకొట్టిన లారీ దాదాపు 20 కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళింది. లారీ
కింద ఇరుక్కున్న బైక్ తీవ్రంగా ధ్వంసమైంది.
కొంతమంది
తమ బైకులను జాతీయరహదారి పక్కనున్న ఓ హోటల్ దగ్గర పార్క్ చేశారు. అదే సమయంలో అటుగా
వచ్చిన లారీ వాటిపై దూసుకెళ్ళింది. ఓ బైకును సుమారుగా 20 కిలోమీటర్లు ఈడ్చుకుపోయింది.
ఈ ఘటనలో ఓ వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
కొయ్యలగూడెం
పోలీసులు ఇచ్చిన సమాచారంతో తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి పోలీసులు
అప్రమత్తమయ్యారు. కొయ్యలగూడెం నుంచి దాదాపు 20కి.మీ దూరంలోని దేవరపల్లి డైమండ్
జంక్షన్ వద్ద లారీని అడ్డగించి డ్రైవర్‌ను
అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంపై కేసు
నమోదు చేసి విచారణ చేపట్టారు.