హైదరాబాద్
లోని నాంపల్లిలో దారుణం జరిగింది. ఓ నివాస
భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. బజార్
ఘాట్ లోని ఓ నివాసంలో మెకానిక్ గ్యారేజీ నిర్వహిస్తున్నారు. అక్కడ నిల్వ ఉంచిన
డీజిల్ డ్రమ్ములకు మంటలు అంటుకుని, నాలుగు
అంతస్తులకు వ్యాపించాయి.
దీంతో మంటల
ధాటికి బిల్డింగ్ లో నివాసం ఉంటున్న వారిలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు
తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చుట్టుపక్కల ప్రాంతాల వారిని కూడా నివాసాల నుంచి
ఖాళీ చేయిస్తున్నారు.
సమాచారం
అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సహాయ
చర్యలు చేపట్టారు.
మూడు ఫైరింజన్ల ద్వారా మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా
శ్రమిస్తున్నారు.
ప్రమాద స్థలం వద్ద పార్క్ చేసిన కార్లతో పాటు ద్విచక్ర వాహనాలు
కూడా కాలి బూడిదయ్యాయి. ప్రమాద స్థలం భయానకంగా ఉండటంతో స్థానికులు తీవ్ర
కలతచెందుతున్నారు.