ఉత్తరప్రదేశ్‌లో అరాచకం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ హోటల్లో మహిళలపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (gang rape) తెగబడ్డారు. శనివారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…బాధితురాలు హోటల్ సిబ్బందిగా గుర్తించారు.
ఘటన తరవాత శనివారం అర్థరాత్రి బాధితురాలి నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని, వెంటనే హోటల్‌కు చేరుకుని ఆమెను సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు ఆగ్రా పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆగ్రా అసిస్టెంట్ కమిషనర్ అర్చన సింగ్ తెలిపారు. బాధితురాలు హోటల్ ఉద్యోగని కమిషనర్ చెప్పారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు పురుషులు, వారికి సహకరించిన ఓ మహిళను కూడా అరెస్ట్ చేశారు.