శివుడికి ప్రీతికరమైన కార్తీకమాసంలో
ప్రత్యేక పూజలకు రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతో పాటు ప్రముఖ ఆలయాలు ముస్తాబయ్యాయి.
నెల రోజుల పాటు భోళా శంకరుడిని నిత్యపూజలతో పాటు జపాలు, దీపాలతో కొలిచి భక్తి
చాటేందుకు భక్తులు సిద్ధమయ్యారు.
వనభోజనాలు
తదితర పుణ్యకార్యాలు చేయడం మూలంగా జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి పుణ్యఫలాలను
ప్రసాదించే మహిమాన్వితమైనది కార్తీక మాసమని, శివపూజకు ఇంతకు మించిన మాసం మరోకటి
లేదని స్కంద పురాణం చెబుతోంది.
కార్తీక మాస ఉత్సవాలు రేపటి నుంచి శ్రీశైలం(srisailam) మహా పుణ్యక్షేత్రంలో మొదలు కానున్నాయి. ఈ ఉత్సవాలు డిసెంబర్ 12 వరకు
కొనసాగనున్నాయి. రద్దీ రోజుల్లో శ్రీమల్లికార్జున స్వామికి భక్తులు నిర్వహించే
గర్భాలయ, సామూహిక అభిషేకాలను రద్దు చేసినట్లు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు
తెలిపారు. శని, ఆది, సోమవారాలతో పాటు సెలవురోజుల్లో స్పర్శ దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించారు.
మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనాలు ఏర్పాటు చేసినట్లు
ఈవో తెలిపారు.