దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపారు. ప్రారంభంలోనే సెన్సెక్స్ 285 పాయింట్లు కోల్పోయి 64973 వద్ద మొదలైంది. నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 19450 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.30 దగ్గర మొదలైంది.
సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో సన్‌ఫార్మా, ఎన్టీపీసీ లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా, టైటన్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, టాటా స్టీల్ ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్ఎం, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
అమెరికా ప్యూచర్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికాకు క్రెడిట్ రేటింగ్‌ను మూడీస్ సంస్థ నెగటివ్‌కు తగ్గించడం కూడా అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి.