వన్డే క్రికట్ వరల్డ్ కప్(CWC-2023)టోర్నీలో భాగంగా భారత జట్టు విజయయాత్ర కొనసాగుతోంది.
చివరి లీగ్ మ్యాచ్ లో భాగంగా జరిగిన మ్యాచులో నెదర్లాండ్స్ పై 160 పరుగుల తేడాతో భారత్ నెగ్గింది. బెంగళూరు చిన్నస్వామి
స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో భారత ఆటగాళ్ళు అద్భుతంగా ఆడారు.
టాస్ గెలిచిన రోహిత్ సేన తొలుత 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగులు చేసింది. కెప్టెన్
రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), కోహ్లీ (51) అర్ధసెంచరీలతో రాణించారు.శ్రేయాస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) శతకాలు కొట్టడంతో
స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
భారీ లక్ష్యఛేదనకు
దిగిన నెదర్లాండ్స్ ను భారత బౌలర్లు 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ చేశారు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్
లో తేజ నిడమానూరు మెరుపు ఇన్నింగ్స్ తో
ఆకట్టుకున్నాడు. తేజ 39 బంతుల్లో 54 పరుగులు చేశాడు.
ఓపెనర్ మాక్స్
ఓడౌడ్ 30, కోలిన్ అకెర్మన్ 35, ఎంగెల్ బ్రెక్ట్ 45 పరుగులు చేశారు. భారత
బౌర్లలో బుమ్రా 2, సిరాజ్ 2, కుల్దీప్ యాదవ్ 2, జడేజా 2, కోహ్లీ , రోహిత్ శర్మ చెరో
వికెట్
తీశారు.
సెమీస్ పోరులో భాగంగా భారత్, న్యూజీలాండ్ మధ్య మ్యాచ్ నవంబరు 15న ముంబై వాంఖెడే
స్టేడియంలో జరగనుంది.