ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 14 నాటికి అల్పపీడనం
ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణకేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా
కదులుతునట్లు పేర్కొన్న అధికారులు, దక్షిణ బంగాళాఖాతంలో ఈ నెల 16 నాటికి
వాయుగుండంగా బలపడనుందని వెల్లడించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో సోమవారం ఒకటి, రెండు
చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 14,15 తేదీల్లో
ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ ప్రాంతాల్లో 15,16 తేదీల్లో పశ్చిమ మధ్య, తూర్పు
బంగాళాఖాతంలో గరిష్ఠంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది.