సోషల్ మీడియాలో పరిచయమైన ఇద్దరు బాలికల వీడియోలను మార్ఫింగ్ చేసి బెదిరించి అత్యాచారానికి (crime news) ఒడిగట్టిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్ నగరంలో ఇద్దరు బాలికలు సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెక్ట్ పెట్టారు. వారి మెసేజ్‌కు స్పందించి వారితో స్నేహం చేస్తున్నట్లు నటించారు…కొందరు యువకులు. బాలికలతో వీడియో కాల్స్ మాట్లాడుతూ వారికి తెలియకుండానే రికార్డ్ చేశారు. ఆ తరవాత వాటిని పోర్న్ వీడియోలతో మార్ఫింగ్ చేసి బాలికలను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
బాలికల ఫిర్యాదుతో నిందితులను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి మొబైల్స్, మత్తు ట్యాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని పోలీసులు సూచించారు. పిల్లలు ఎక్కువగా సోషల్ మీడియాలో గడుపుతున్నారని, వారితో తల్లిదండ్రులు మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకోవాలని పోలీసులు సలహా ఇచ్చారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని కూడా వారు సూచించారు.