వరల్డ్కప్ టోర్నీలో భాగంగా జరిగిన
మ్యాచ్ లోఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఘోరంగా ఓడింది. లక్ష్య ఛేదనలో 43.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయింది.
బ్రిటీషు జట్టు చేతిలో 93 పరుగుల తేడాతో ఓడింది. టోర్నీలో ఐదో ఓటమితో ఆ జట్టు
స్వదేశీ ప్రయాణానికి సిద్ధమైంది.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 9 వికెట్లు నష్టపోయి 337
పరుగులు చేసింది.
స్టోక్స్(80), రూట్(60), బెయిర్ స్టో (59) భాగస్వామ్యంతో భారీ
స్కోరు చేసింది.
పాకిస్తాన్ బౌలర్లలో రవుఫ్3, షాహీన్, వసీమ్ చెరో రెండు
వికెట్లు పడగొట్టారు.
పాకిస్తాన్ జట్టులో సల్మాన్(51), షఫీఖ్(0), ఫఖర్ జమాన్(1),
ఇఫ్తిఖార్(3), షాదాబ్(4) విఫలమయ్యారు. బాబర్(38), రిజ్వాన్(36), రవుఫ్(35)
పోరాడినప్పటికీ అక్కరకు రాలేదు. ఇంగ్లండ్ బౌలర్ విల్లీ మూడు వికెట్లు తీసి మ్యాన్
ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కైవసం చేసుకున్నాడు.
ఇంగ్లండ్ నిర్దేశించిన 338 పరుగుల విజయలక్ష్యాన్ని పాకిస్తాన్ 6.4 ఓవర్లలో ఛేదిస్తే పాయింట్ల పట్టికలో నాలుగో
స్థానంతో పాక్ సెమీస్ చేరేది. `
ఐసీసీ
వరల్డ్ కప్ లో మొదటి సెమీఫైనల్ ఈ నెల 15న ముంబై వాంఖెడే స్టేడియంలో జరగనుంది.
రెండో సెమీఫైనల్ కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఈ నెల 16న జరగనుంది. ఫైనల్ మ్యాచ్ ఈ నెల 19న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ
స్టేడియంలో ఉంటుంది.