వన్డే వరల్డ్
కప్(cwc-2023) టోర్నీలో
భాగంగా చివరి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది.
బంగ్లాదేశ్తో జరిగిన పోరులో ఆసీస్ 8 వికెట్ల
తేడాతో నెగ్గింది. తొలుత బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 306 పరుగులు చేసింది. 307 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా , 2
వికెట్లు నష్టపోయి 44.4 ఓవర్లలో ఛేదించారు.
మార్ష్ సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు. 132 బంతుల్లో 177 పరుగులు సాధించి అద్భుత ఇన్నింగ్స్
ఆడాడు.
ఆసీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్
ట్రావిస్ హెడ్ 10
పరుగులకే వెనుదిరిగినప్పటికీ, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 53 పరుగులతో రాణించాడు.
మార్ష్, స్టీవ్ స్మిత్ జోడీ మరో వికెట్
పడకుండా జట్టును విజయంవైపు నడిపించారు. స్మిత్ 64 బంతుల్లో
63 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్
అహ్మద్, ముస్తాఫిజూర్ రెహ్మాన్ చెరో వికెట్ తీశారు.
తాజా గెలుపుతో ఆస్ట్రేలియా
మొత్తం 9 మ్యాచులు ఆడి 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. పాయింట్ల
పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. సెమీస్
పోటీలో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది.