విజయవాడ
ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో దీపావళి సంబరాల్లో
భాగంగా పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ధనత్రయోదశి సందర్భంగా శ్రీమహాలక్ష్మీ
యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ క్రతువులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శుక్రవారం
ధన్వంతరి జయంతి సందర్భంగా విశ్వఆయుర్వేద పరిషత్, సురక్ష ఆయుర్వేద చికిత్సాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు.
సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర ఈ మూడింటిని సక్రమంగా పాటించి
సగం ఆరోగ్యం పొందవచ్చునని పురాతన యోగా ద్వారా కూడా మంచి ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు
అన్నారు.
ప్రతీ ఆదివారం దేవస్థానం ప్రాంగణంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం, యోగా శిక్షణ నిర్వహించాలని
విశ్వఆయుర్వేద పరిషత్ మరియు సురక్ష ఆయుర్వేద చికిత్సాలయం వారిని ఈవో కోరారు.