ఉమ్మడి
పౌరస్మృతి (UCC)అమలుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం
సిద్ధమవుతోంది. సీఎం పుష్కర్‌సింగ్ దామీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు త్వరలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ
బిల్లును చట్ట రూపంలోకి తీసుకురావాలని భావిస్తోంది.
సుప్రీంకోర్టు మాజీ
న్యాయమూర్తి జస్టిస్ రంజనాప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో ఏర్పాటైన ఐదుగురు సభ్యుల
కమిటీ దీనికి సంబంధించిన నివేదికను త్వరలో సమర్పించనుంది.
పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత తదితర అంశాల్లో కుల, మతాలతో
సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైన నిబంధనలు అమలు చేయడమే ‘ఉమ్మడి పౌరస్మృతి’ చట్టం
ఉద్దేశం.
తాము అధికారంలోకి వస్తే యూసీసీని తీసుకొస్తామని ఉత్తరాఖండ్ బీజేపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అందుకు
అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే 2022 మేలో నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ
రాబోయే మూడు నాలుగు రోజుల్లో తన నివేదికను సమర్పించనుంది.
ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలయ్యాక.. 2024 ఎన్నికలకు ముందే గుజరాత్‌లోనూ అమలు చేయాలని బీజేపీ
యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే యూసీసీని అమలు చేసిన రెండో రాష్ట్రంగా
గుజరాత్ నిలవనుంది. స్వాతంత్ర్యానికి ముందు నుంచే గోవాలో సివిల్ కోడ్
అమలవుతోంది.