శ్రీనగర్
లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం దాల్ సరస్సులో నేటి తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం
జరిగింది. నీటిపై నిలిపి ఉంచిన ఐదు హౌస్ బోట్లు కాలిబూడిదయ్యాయి. భారీగా ఎగసిపడిన మంటలు
ఇతర బోట్లకు కూడా అంటుకున్నాయని స్థానికులు చెప్పారు.
ప్రమాదంలో ఐదు బోట్లు మాత్రం
పూర్తిగా తగలబడి పోయాయన్నారు.
దాల్ లేక్ లోని ఘాట్ నెంబర్ 9 వద్ద నిలిపి ఉంచిన ఓ హౌస్ బోట్లో తొలుత మంటలు
చెలరేగాయని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం
తప్పిందని, ఆస్తినష్టం కోట్లలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాద కారణం తెలియాల్సి ఉందని విద్యుదాఘతం కారణంగానే
మంటలు చెలరేగి ఉండొచ్చని భావిస్తున్నారు.