800 TREMORS IN 14 HOURS, ICELAND DECLARES EMERGENCY
ఐస్‌ల్యాండ్ నైరుతి భాగంలోని రేకేన్స్
ప్రాంతంలో శుక్రవారం వరుస భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గురువారం అర్ధరాత్రి
నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2గంటల లోపు, అంటే 14 గంటల వ్యవధిలో 800 ప్రకంపనలు చోటు
చేసుకున్నాయని ఐస్‌ల్యాండ్ వాతావరణ శాఖ
వెల్లడించింది. ఆ నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు.
‘‘ఇంతకంటె పెద్దస్థాయిలో భూకంపాలు చోటు
చేసుకునే అవకాశం ఉంది. అగ్నిపర్వతం పేలే ప్రమాదం కూడా కనిపిస్తోంది. అందుకే
అత్యవసర పరిస్థితి ప్రకటించాం’’ అని ప్రభుత్వం ప్రకటించింది.
అగ్నిపర్వతం పేలితే దాని ప్రభావం వల్ల
లావా కొన్ని రోజుల పాటు పెల్లుబుకుతూనే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
శుక్రవారం నాటి భూప్రకంపనల వెల్లువ
గ్రిండావిక్ గ్రామానికి 3కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది. ఆ గ్రామంలో సుమారు
4వేల జనాభా ఉంది. అగ్నిపర్వతం పేలే అవకాశం కూడా ఉన్నందున ప్రభుత్వం ఆ గ్రామాన్ని ఖాళీ
చేయించాలని భావిస్తోంది.
ఐస్‌ల్యాండ్ ద్వీపకల్పంలో అక్టోబర్
నెలాఖరు నుంచి ఇప్పటివరకూ 24వేల ప్రకంపనలు నమోదవుతాయి.
గ్రిండావిక్ గ్రామం భూమ్యుపరితలం నుంచి 5
కిలోమీటర్ల లోతులో మాగ్మా జమ అవుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. అది భూమిమీదకు ఉబికి
రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని సూచించింది. లావా ఆగ్నేయ దిశ నుంచి
పశ్చిమంగా ప్రవహిస్తుంది, అంతేతప్ప గ్రిండావిక్ గ్రామం వైపు ప్రవహించబోదని
చెప్పింది.