తెలంగాణ
అసెంబ్లీ ఎన్నికల్లో(TS
ELECTIONS)
నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారపర్వంలో బీజేపీ(BJP) దూసుకెళుతోంది. జాతీయ, రాష్ట్ర
స్థాయి ముఖ్యనేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ బీజేపీ హామీలు వివరిస్తున్నారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సాయంతో పాటు బీజేపీ పాలనలోని
రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తున్నారు.
ప్రచారంలో
భాగంగా ప్రధాని మోదీ రెండోవిడత తెలంగాణ పర్యటనకు సిద్ధమయ్యారు. వరుసగా మూడు రోజుల
పాటు ఆయన తెలంగాణలోనే ఉండి పలు ప్రాంతాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని
ప్రసంగించనున్నారు.
ఈ
నెల 25న
కరీంనగర్, 26న
నిర్మల్ బహిరంగ సభల్లో మోదీ ముఖ్యఅతిథిగా
పాల్గొంటారు. 27న
హైదరాబాద్‌లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొని బీజేపీ విధానాలను వివరిస్తారు.
ప్రధాని
పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం, గెలుపే లక్ష్యంగా మోదీ
సభలకు పెద్దఎత్తున జనసమీకరణ చేయనుంది.
ప్రధాని
నరేంద్రమోదీ నేటి సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు.
సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో
జరిగే అణగారిన వర్గాల విశ్వరూప మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
‘సమగ్ర న్యాయానికి నాంది దండోరా… చలో
హైదరాబాద్’ నినాదంతో, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ
ఎమ్మార్పీఎస్ విశ్వరూప సభను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.