శ్రీశైల(SRISAILAM) పుణ్యక్షేత్రానికి సమీపంలో ఓ చిరుత(CHEETAH) మృతి చెందింది. పుణ్యక్షేత్రానికి సుమారు నాలుగు కిలోమీటర్ల
దూరంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. చిరుత రోడ్డు దాటుతుండగా
గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే మరణించింది.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న
అటవీశాఖ సిబ్బంది, చిరుత కళేబరాన్ని సున్నిపెంట అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. మృతి
చెందినది ఆడ చిరుత అని, దాని వయసు సుమారు ఆరు నెలలు ఉంటుందన్నారు. రాత్రివేళల్లో ఈ
ప్రాంతంలో చిరుతల సంచారం ఎక్కువగా ఉంటుందని, శ్రీశైలం వైపుగా వెళ్ళే వాహనం ఢీకొట్టి
ఉండొచ్చని అనుమానిస్తున్నారు.