వ్యవసాయ
విస్తరణాధికారి (AEO)పై మండల వ్యవసాయాధికారిణి(AO) కత్తితో దాడి చేసిన ఘటన యాదాద్రి
భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఆత్మకూరు(ఎం) మండల వ్యవసాయాధికారిణిగా ఎన్.శిల్ప
2018
నుంచి పనిచేస్తున్నారు.
పల్లెపహాడ్
వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేస్తు మనోజ్, శిల్ప మధ్య రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం
నడుస్తోంది. అయితే, 2012లోనే మరో వ్యక్తితో శిల్పకు వివాహం జరగగా ఆమెకు
రెండేళ్ళ బాబు కూడా ఉన్నాడు.
శిల్పతో
ప్రేమవ్యవహారం మనోజ్ తల్లిదండ్రులకు తెలియడంతో వారు అతడిని మందలించారు. దీంతో
మనోజ్ ఆమెకు దూరంగా ఉంటున్నాడు.
మూడు
నెలల కిందట యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటకు డిప్యూటేషన్‌పై వెళ్లి.. తర్వాత రెండు
నెలలు సెలవు పెట్టారు.
తిరిగి విధులకు హాజరయ్యేందుకు
శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయానికి
వచ్చారు. అదే సమయంలో ఏవో శిల్ప తారసపడి.. మనోజ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు.
దీంతో
ఇరువురి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు
దారితీసింది. ఈ క్రమంలో శిల్ప కత్తితో మనోజ్‌పై దాడి చేశారు. మెడ, వీపు భాగాలపై రెండు పోట్లు పడటంతో
మనోజ్‌కు గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు.
మనోజ్‌తో
తాను రిలేషన్‌లో ఉన్నానని.. జూన్ 7, 2022లో రహస్యంగా వివాహం కూడా చేసుకున్నాడని
శిల్ప చెబుతోంది. మొదటి భర్తకు విడాకులు
ఇచ్చి తనతోనే ఉండాలని మనోజ్ ఒత్తిడి చేశారని చెప్పారు. తనతో పాటు బాబును
తీసుకువస్తానని చెప్పగా.. వాడిని చంపేస్తానంటూ బెదిరించాడని చెబుతోంది.
మూడు
నెలల నుంచి తనను పట్టించుకోకుండా దూరంగా ఉంటున్నారని ఆమె ఆరోపించారు. కలెక్టరేట్
ఘటనలో అతనే తనపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించగా ఆత్మరక్షణ కోసం ఎదురు దాడి
చేశానని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.