వన్డే క్రికెట్ వరల్డ్ కప్ (CWC-2023) టోర్నీలో
ఆప్ఘానిస్తాన్ పై దక్షిణాఫ్రికా ఐదు
వికెట్ల తేడాతో విజయం సాధించింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (97
నాటౌట్) పోరాటంతో ఆప్ఘనిస్తాన్ 50
ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. కొయెట్జి (4/44), కేశవ్
మహరాజ్ (2/25), ఎంగిడి (2/69)
కలిసి ప్రత్యర్థిని దెబ్బకొట్టారు.
ఛేదనలో దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 47.3
ఓవర్లలో విజయం సాధించింది.
వన్డౌన్
బ్యాటర్ డసెన్ (76 నాటౌట్) అజేయ అర్ధశతకంతో రాణించగా.. డికాక్
(41), ఫెలుక్వాయో (39 నాటౌట్), మార్కమ్ (25), మిల్లర్ (24), బవుమా (23) పరుగులు చేశారు. ఆప్ఘన్ బౌలర్లలో రషీద్, నబీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. డసెన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’
అవార్డు దక్కింది.
తొలుత
బ్యాటింగ్ చేసిన ఆప్ఘన్ జట్టు లో ఒమర్జాయ్ 97 పరుగులతో రాణించాడు. 107 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 3 సిక్సులు కొట్టాడు. ఓవైపు
వికెట్లు పడుతున్నప్పటికీ ఒమర్జాయ్ ఎంతో సహనంతో ఆడి జట్టుకు ఓ మోస్తరు స్కోరు
వచ్చేందుకు దోహదపడ్డాడు.
ఆఫ్ఘన్
ఇన్నింగ్స్ లో ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (25), ఇబ్రహీం జాద్రాన్ (15) తొలి వికెట్ కు 41 పరుగులు జోడించి
ఫర్వాలేదనిపించారు. రహ్మత్ షా 26, నూర్ అహ్మద్ 26 పరుగులు చేశారు. కెప్టెన్
హష్మతుల్లా షాహిది (2), మహ్మద్ నబీ (2) నిరాశపరిచారు.