Veteran actor Chandramohan
passes away
సీనియర్ తెలుగు నటుడు చంద్రమోహన్ ఈ ఉధయం
తుదిశ్వాస విడిచారు. 80 ఏళ్ళ చంద్రమోహన్ కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
కొన్నిరోజులుగా హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం ఆయన
ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు.
చంద్రమోహన్ అసలుపేరు మల్లంపల్లి
చంద్రశేఖరరావు. ఆయన 1943 మే 23న కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో జన్మించారు. ఆయన
1966లో రంగులరాట్నం సినిమా ద్వారా పరిశ్రమకు పరిచయం అయ్యారు. తొలిచిత్రంతోనే ఉత్తమ
నటనకు నంది పురస్కారం గెలుచుకున్నారు. మొత్తంగా ఆరు నంది అవార్డులు, రెండు
ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. ప్రముఖ సినీదర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్
ఈయనకు దగ్గరి బంధువు.
రంగులరాట్నం తర్వాత
బంగారు పిచిక, బాంధవ్యాలు, సుఖదు:ఖాలు వంటి సినిమాల్లో నటించారు చంద్రమోహన్. వాటిలో
నటనకు ఆయనకు మంచిపేరు వచ్చింది. పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, శంకరాభరణం,
సీతామాలక్ష్మి, రాం రాబర్ట్ రహీం, రాధాకళ్యాణం, రెండురెళ్ళు ఆరు, చందమామ రావె వంటి
సినిమాల్లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. చంద్రమోహన్ తమిళంలోనూ పలు
చిత్రాల్లో నటించారు.