వన్డే క్రికెట్ వరల్డ్ కప్ (CWC-2023)
టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికా, ఆప్ఘనిస్తాన్
తలపడుతున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో
టాస్ గెలిచిన ఆప్ఘన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా ముందు 245 పరుగుల లక్ష్యాన్ని
ఉంచింది.
కేశవ్ మహరాజ్ వేసిన 8.1 బంతికి ఓపెనర్
రహమానుల్లా గుర్బాజ్ (25) ఔట్ అయ్యాడు. గెరాల్డ్ కోయెట్జీ వేసిన 9.3 బంతికి
ఇబ్రహీం జద్రాన్ కూడా పెవిలియన్ చేరాడు. క్వింటన్ డీ కాక్ కు ఇచ్చి 15 పరుగుల
వ్యక్తిగత వద్ద వెనుదిరిగాడు. కేశవ మహారాజ్ బౌలింగ్ లో మరో బ్యాట్స్ మెన్ హష్మత్
షాహిది కూడా ఔటయ్యాడు. 7 బంతులు ఆడి 2
పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
రహమత్ షా (26)
క్యాచ్ ఔట్ అయ్యాడు. 24 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయిన ఆప్ఘన్ జట్టు 94
పరుగులు చేసింది.
112 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పయింది.
26.5 బంతికి ఇక్రమ్ అలీ ఖిల్(12) క్యాచ్ ఔట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్ లో మహ్మద్ నబీ కూడా మూడు బంతులు
ఆడి రెండు పరుగులు వద్ద వికెట్ కోల్పోయాడు.
37 ఓవర్లకు ఆరు వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది. 37.5 బంతికి రషీద్
ఖాన్ కూడా ఔట్ కావడంతో ఆప్ఘన ప్రదర్శనంగా అధ్వానంగా మారింది.
43 ఓవర్లు ముగిసే
సరికి కాబూలి జట్టు స్కోరు 188కి చేరింది. 45.6 వ బంతికి నూర్ అహ్మద్ ఔట్ అయ్యాడు. 32 బంతులు ఆడి 26 పరుగులు చేసి
కోయెట్జీ బౌలింగ్ లో క్వింటన్ డీకాక్ కు క్యాచ్ అందించి వెనుదిరిగాడు. 47 వ ఓవర్
లో 20 పరుగులు రాబట్టారు. 8 వికెట్ల నష్టానికి 224 పరుగులకు స్కోర్ బోర్డు
చేరింది. తర్వాతి ఓవర్లో 9 వికెట్ కోల్పోయింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (8) పరుగుల
వద్ద కొయెట్జీ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. నవీన్
ఉల్ హక్ చివరి బంతికి రన్ ఔట్ అవడంతో ఆప్ఘన్ ఇన్నింగ్స్ 244 వద్ద ముగిసింది.
అజ్మత్
ఒమర్జాయ్ (97*) సెంచరీ మిస్ అయ్యాడు. 107 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్ గా
ఉన్నాడు.
సఫారీ బౌలర్లు లుంగి ఎంగిడి 2, కొయెట్జీ 4, కేశవ్ మహరాజ్ 2,
ఆండిలే ఫెహ్లుక్యాయో1 వికెట్ తీశారు.