లక్షలాది మంది జీమెయిల్ (gmail) ఖాతాలు డిలీట్ ముప్పు ఎదుర్కొంటున్నాయి. చాలా కాలంగా వినియోగించని ఖాతాలను తొలగించాలని గూగుల్ నిర్ణయించింది. కనీసం 2 సంవత్సరాలుగా ఉపయోగించని ఖాతాదారులకు ఈ ముప్పు పొంచి ఉంది. మరో రెండు నెలల్లో వినియోగించని ఖాతాలను డిలీట్ చేయనున్నారు.
జీమెయిల్ ఖాతాలు డిలీట్ చేసే ముందు ఖాతాదారులకు హెచ్చరికలు పంపుతామని గూగుల్ తెలిపింది. తొలగించే ఖాతాలతోపాటు, రికవరీ మెయిల్స్‌కు కూడా హెచ్చరిక సందేశాలు పంపుతామని వెల్లడించింది. ఇప్పటికే ఇలాంటి ఖాతాలకు హెచ్చరికలు పంపినట్లు గూగుల్ (google) గుర్తు చేసింది.జీమెయిల్‌తో అనుసంధానమైన డాక్స్, డ్రైవ్, మీట్, కేలండర్, ఫోటోలు, కంటెంట్ సైతం తొలగించనున్నారు.
సుదీర్ఘకాలం వినియోగించని ఖాతాలకు అనేకసార్లు ఉపయోగించిన పాస్ వర్డ్స్ ఉంటాయని గూగుల్ తెలిపింది. ఇలాంటి వాటికి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా ఉండి ఉండకపోవచ్చని గుర్తు చేసింది. ఇలాంటి ఖాతాల సెక్యూరిటీ, ప్రైవసీ విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున వాటిని తొలగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.