ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ నిల్వలపై వడ్డీ మొత్తాలను ఖాతాదారుల
ఖాతాల్లో జమ చేస్తోన్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో వడ్డీ మొత్తాలు జమ
అవ్వగా.. మిగతా వారి అకౌంట్లో జమ చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది.
2022-23 ఆర్థిక ఏడాదికి ఈపీఎఫ్ నిల్వలలపై 8.15 శాతం వడ్డీ చెల్లించేందుకు ప్రభుత్వం
ఆమోదం తెలిపింది. దీంతో ఈపీఎఫ్ఓ వడ్డీని ఆయా ఖాతాల్లో జమ చేస్తోంది. ఈపీఎఫ్ఓ
వెబ్సైట్, ఉమాంగ్ యాప్ ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
ఇప్పటికే 24 కోట్లకు పైగా అకౌంట్లలో వడ్డీ పడగా,
మిగతా ఖాతాల్లో జమ అయ్యేందుకు మరికొంత సమయం పట్టనుంది.