ఇంటర్నేషనల్
క్రికెట్ కౌన్సిల్ (ICC) అక్టోబర్ మంత్లీ అవార్డులు
ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు సంబంధించి
ప్రతీనెలా మహిళా, పురుషుల విభాగాల్లో ఈ పురస్కారం ప్రకటిస్తారు.
కివీస్ ఆటగాడు రచిన్ రవీంద్రను
అక్టోబర్ మంత్లీ అవార్డు వరించింది. బుమ్రాతోపాటు దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్
డికాక్‌తో పోటీ పడి మరీ రచిన్ ఈ అవార్డు కైవసం చేసుకున్నాడు.
రచిన్
రవీంద్ర (Rachin Ravindra) ఈ వరల్డ్‌కప్‌లో అక్టోబర్ నెలలో కివీస్ ఆడిన మ్యాచుల్లో ఇంగ్లండ్‌పై
123
పరుగులు, ఆస్ట్రేలియాపై
116
పరుగులు చేశాడు. ఆ నెలలో ఆరు మ్యాచుల్లో 81.20 సగటుతో 406 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా ‘ప్లేయర్
ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఎంపిక కావడంపై రచిన్ రవీంద్ర ఆనందం వ్యక్తం చేశాడు. ‘ఐసీసీ అవార్డు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు జట్టుకు
ఈ నెల చాలా ప్రత్యేకం. భారత్‌లో వరల్డ్ కప్ ఆడడం మరింత ప్రత్యేకం’ అని రవీంద్ర
అన్నాడు.
మహిళల విభాగంలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ హేలీ మాధ్యూస్(Hayley Matthews) విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో 99*, 132, 79 పరుగులు సాధించి
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గానూ నిలిచింది. బౌలింగ్‌లోనూ 3/36 ప్రదర్శనతో ఆసీస్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర
పోషించింది.