ఆధార్ కార్డుతో లింక్ చేసుకోని 11.5 కోట్ల పాన్ కార్డులను డీయాక్టివ్ చేశారు. ఆధార్ అనుసంధానికి ఇచ్చిన గడువు జూన్ 30తో ముగియడంతో కోట్లాది కార్డులు డీయాక్టివ్ అయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBIT) ప్రకటించింది. దేశవ్యాప్తంగా 70.24 కోట్ల పాన్ కార్డులు ఉండగా, అందులో 57.25 కోట్ల మంది మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారని సిబీడీటీ తెలిపింది.
మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త శేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం మేరకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2017 జులై 1 కంటే ముందు జారీ చేసిన కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆదాయపన్ను చట్టం ప్రకారం ఈ నిబంధన పూర్తి చేయాల్సి ఉంది. అనేక దఫాలు గడవు పొడిగించినా ఇంకా 11.5కోట్ల మంది ఆధార్‌తో పాన్ (PAN) అనుసంధానం చేసుకోలేదు. కార్డులను పునరుద్దరించుకోవడానికి సీబీడీటీ అవకాశం కల్పించింది. అయితే ఇందుకు రూ.1000 పెనాల్టీ చెల్లించారు. ఆఖరి గడవులోగా చేయని వారు పెనాల్టీ చెల్లించి వాటిని పునరుద్దరించుకోవచ్చు.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల