తిరుమల
శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించిన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లను విడుదల చేసింది. కేవలం 21 నిమిషాల్లోనే ఈ టికెట్లు అయిపోయాయి. మొత్తం 2.25 లక్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను భక్తులకు అందించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు భక్తుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. 14 నిమిషాల వ్యవధిలోనే 80 శాతం టికెట్ల అమ్మకాలు పూర్తయ్యాయి.
2.25 లక్షల ప్రత్యేక దర్శన టికెట్లను అందుబాటులో ఉంచనుంది.
ఉదయం
10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు
దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. రోజుకు 2 వేల చొప్పున 10 రోజుల పాటు 20 వేల
టికెట్లు విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది.
వసతి
గదుల కోటాను సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తారు. http://ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని
టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
శ్రీనివాసమంగాపురంలో
శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
ఉదయం శ్రీదేవి, భూదేవి శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామివార్లు యాగశాలకు వేంచేసే
కార్యక్రమం నిర్వహించారు.
పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం సహా ఇతర వైదిక
కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. పవిత్రోత్సవాల కారణంగా నవంబరు 9 నుంచి 11 వరకు
కళ్యాణోత్సవం రద్దు చేశారు.