Mumbai car accident, three die
ముంబై మహానగరంలో గురువారం రాత్రి
జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు, మరో ఆరుగురు గాయాల
పాలయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం… బాంద్రా వైపు
వెడుతున్న ఒక టయోటా ఇన్నోవా కారు బాంద్రా-వర్లీ సీ లింక్ దగ్గర టోల్ ప్లాజాకు వంద
మీటర్ల ముందు ఒక మెర్సిడీజ్ కారును గుద్దేసింది. పోలీసుల నుంచి తప్పించుకునే
ప్రయత్నంలో ఇన్నోవా కారు టోల్ ప్లాజా వైపు దూసుకుపోయింది. అక్కడ పెద్దసంఖ్యలో
వాహనాలు ఉండడంతో వాటిని దాటుకుని ముందుకు వెళ్ళడం సాధ్యం కాలేదు. ఆ క్రమంలో ఇన్నోవా
వాహనం, మరికొన్ని కార్లను ఢీకొట్టింది. గురువారం రాత్రి సుమారు పదిన్నర సమయంలో ఆ
ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ప్రాణాలు కోల్పోయారు.
‘‘ప్రమాదంలో మొత్తం ఆరు వాహనాలు
ధ్వంసమయ్యాయి. తొమ్మిది మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరి
పరిస్థితి విషమంగా ఉంది’’ అని సీనియర్ పోలీస్ అధికారి కృష్ణకాంత్ ఉపాధ్యాయ
వెల్లడించారు.
5.6
కిలోమీటర్ల పొడవైన, ఎనిమిది రహదారుల బాంద్రా వర్లీ-సీ లింక్, ముంబై పశ్చిమాన ఉన్న
బాంద్రా, దక్షిణాన ఉన్న వర్లీ ప్రాంతాలను కలిపే రహదారి. అనునిత్యం రద్దీగా ఉండే ఆ
రహదారి మీద ఇటీవల తరచుగా కారు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.