వన్డే క్రికెట్ వరల్డ్ కప్ (CWC-2023) టోర్నీలో భాగంగా న్యూజీలాండ్ జట్టు శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో నెగ్గింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో
జరిగిన ఈ లీగ్ మ్యాచ్ లో న్యూజీలాండ్ అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనతో
ఆక్టుకుంది.
తొలుత శ్రీలంకను 46.4 ఓవర్లలో 171 పరుగులకే పెవిలియన్‌కు పంపిన కివీస్ ఆటగాళ్ళు 172
పరుగుల విజయలక్ష్యాన్ని 23.2
ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి ఛేదించారు.
కివీస్ ఓపెనర్లు డెవాన్ కాన్వే (45), రచిన్ రవీంద్ర
(42) తొలి వికెట్ కు 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
కెప్టెన్ కేన్ విలియమ్సన్ (14)
విఫలమైనా డారిల్ మిచెల్
(43) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. గ్లెన్ ఫిలిప్స్ (17),
టామ్ లాథమ్ (2) అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు.
శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్ 2, మహీశ్ తీక్షణ, చమీర చెరో వికెట్
తీశారు.
న్యూజీలాండ్,
శ్రీలంక జట్లకు వరల్డ్ కప్ టోర్నీలో ఇదే చివరి లీగ్ మ్యాచ్. న్యూజీలాండ్
ప్రస్తుతం 9 మ్యాచ్ లు ఆడి 5
విజయాలతో 10 పాయింట్లు అందుకుంది. ఆ జట్టు సెమీస్ చేరాలంటే… పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు
తమ చివరి లీగ్ మ్యాచుల్లో ఓడిపోవాలి. ఒకవేళ గెలిస్తే రన్‌రేట్ కీలకమవుతుంది.