వన్డే క్రికెట్ వరల్డ్ కప్(CWC-2023) టోర్నీలో భాగంగా నేడు జరుగుతున్న
మ్యాచ్ లో శ్రీలంక, న్యూజీలాండ్(NEW ZEALAND VS SRI LANKA) తలపడుతున్నాయి. చినస్వామి స్టేడియం వేదికగా
జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచులో శ్రీలంక
ప్రదర్శన గతంలో లాగే పేలవంగా ఉంది. కివీస్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్‌తో సహా అందరూ
వరుసగా పెవిలియన్ చేరారు. 46.4 ఓవర్లకు 171 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు
దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి
ఓపెనర్ పాథుమ్ నిశ్శంక(2) ను టిమ్ సౌతీ ఔట్ చేశాడు. నాలుగో ఓవర్లో కెప్టెన్
కుశాల్ మెండిస్(6), సమరవిక్రమ (1) ఔటయ్యారు.
ధాటిగా ఆడుతున్న కుశాల్
పెరీర(51) ఫెర్గూసన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి శాంట్నర్
చేతికి దొరికాడు. దీంతో, శ్రీలంక 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో
పడింది.
సదీరా
సమరవిక్రమ (1), చరిత్ అసలంక (8) వరుసగా పెవిలియన్
బాటపట్టారు. ఏంజెలో మాథ్యూస్ (16), ధనంజయ డిసిల్వా (19), కరుణరత్నె (6), దుష్మంత చమీరా (1) పరుగులు చేశారు. 128 పరుగులకే తొమ్మిది
వికెట్లు కోల్పోయిన లంక.. మహీశ్ తీక్షణ (39*), దిల్షాన్ మదుశంక (19) పోరాడటంతో స్కోరు కొంచెం
మెరుగుపడింది.
ట్రెంట్ బౌల్ట్ 3, టిమ్ సౌతీ 1, ఫెర్గూసన్ 2, శాంతర్ 2, రచిన్ 2 వికెట్లు
తీశారు.
ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధిస్తేనే న్యూజీలాండ్ సెమీస్ అవకాశం
మెరుగుపడుతుంది.