విజయవాడలో (vijayawada crime)ఘోరం చోటు చేసుకుంది. నగరపాలక సంస్థ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.నగరంలోని మురుగు కాలువలపై మూతలు ఏర్పాటు చేయాలని ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. దీంతో నగరంలోని రాజరాజేశ్వరిపేటలో అష్రఫ్ అనే ఐదేళ్ల బాలుడు నాలాలోపడి ప్రాణాలు కోల్పోయాడు.
బాలుడు నాలాలో పడిపోయిన విషయం తల్లిదండ్రులు కూడా గుర్తించలేదు. రాత్రి పది గంటలకు కూడా అష్రఫ్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలు మొత్తం పరిశీలించారు. అయినా ఆచూకీ దొరకలేదు. దీంతో సమీపంలోని నాలాలో వెతగ్గా బాలుడి మృతదేహం లభించింది. దీంతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.