Aligarh soon to be renamed as Harigarh
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ పేరు త్వరలో ‘హరిగఢ్’గా మారనుంది. నగర
మునిసిపల్ కార్పొరేషన్ ఆ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసింది. తాము చేసిన ప్రతిపాదనను
నగర కార్పొరేషన్, రాష్ట్రప్రభుత్వానికి పంపించాలి. దానికి రాష్ట్రప్రభుత్వం ఆమోదించాలి.
ఆ లాంఛనం పూర్తయితే ఇన్నాళ్ళూ అలీగఢ్గా వ్యవహరించబడిన ఊరు ఇకపై హరిగఢ్ పేరుతో
వెలిగిపోతుంది.
అలీగఢ్ పేరును మార్చాలన్న ప్రతిపాదన
ఇప్పటిది కాదు. 1970ల నుంచే ఆ పేరు మార్చాలన్న డిమాండ్లున్నాయి. హిందూ
పురాణగాధల్లో ఈ ప్రాంతం పేరు హరిగఢ్ అని ఉందని విశ్వహిందూపరిషత్ చెబుతోంది. 70లలో
జనసంఘ్ పార్టీ నగర యూనిట్ పేరు మార్పు కోసం డిమాండ్ చేసింది. ఊరిపేరు ‘హరిగఢ్’గా
మార్చాలంటూ 2021లో అలీగఢ్ జిల్లా పంచాయత్ తీర్మానం చేసి ఆమోదించింది.
ప్రాచీనకాలంలో ఈ ప్రాంతాన్ని హరిగఢ్
అని పిలిచేవారు. సామాన్యశకం 13వ శతాబ్దంలో కోయిల్ లేదా కోల్ అని వ్యవహరించేవారు. సామాన్యశకం
1740లలో మొగల్ సైన్యాధిపతి మీర్జా నజఫ్ ఈ ప్రాంతం పేరును అలీగఢ్ అని మార్చాడు.
ముస్లిముల, బ్రిటిష్ వారి పాలనా కాలంలో స్థానిక హిందువులు ఎన్నోసార్లు విన్నవించుకున్నా
ప్రయోజనం లేకపోయింది. తమ మతాన్ని వ్యాప్తి చేసే ఉద్దేశంతో తాము ఆక్రమించిన ప్రాంతాల
పేర్లన్నీ మార్చేసిన ముస్లిములు హిందువుల ఆవేదనను విస్మరించారు. వారి తర్వాత
వచ్చిన బ్రిటిష్ వారు సైతం హిందువుల వినతుల పట్ల ఉదాసీన వైఖరినే అనుసరించారు. ఇక
స్వాతంత్ర్యానంతరం దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్, ఎప్పుడూ ముస్లిం
సంతుష్టీకరణ విధానాన్నే అనుసరించిందన్నది మన కళ్ళముందున్న వాస్తవం.
‘‘మంగళవారం జరిగిన మునిసిపల్
కార్పొరేషన్ సమావేశంలో అలీగఢ్ పేరును ‘హరిగఢ్’గా మార్చాలన్న ప్రతిపాదన వచ్చింది.
కార్పొరేషన్ కౌన్సిలర్లు అందరూ ఆ ప్రతిపాదనను ఏకగ్రీవంగా సమర్ధించారు. ఇప్పుడు ఈ
ప్రతిపానను పై అధికారులకు పంపించాం. కొన్ని వందల యేళ్ళుగా మా ప్రాంత ప్రజల ఆశ అయిన
ఈ పేరు మార్పు. మా ప్రతిపాదనను పై అధికారులు అంగీకరిస్తారని ఆశిస్తున్నాను’’ అని
అలీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రశాంత్ సింఘాల్ వెల్లడించారు.
ముస్లిం రాజుల దురాక్రమణలతో
అస్తిత్వాన్ని కోల్పోయిన హిందువులు స్వాభిమానం కోసం వందల యేళ్ళుగా పోరాడుతూనే
ఉన్నారు. ఆ క్రమంలోనే తమపై బలవంతంగా రుద్దిన పేర్లను తిరిగి మార్చాలన్న డిమాండ్లు
ఊపందుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే మూడు ఊళ్ళ పేర్లు మారాయి. అలహాబాద్‌ను
ప్రయాగరాజ్‌గానూ, ముగల్ సరాయ్‌ని దీనదయాళ్ ఉపాధ్యాయ నగర్గానూ, ఫైజాబాద్‌ను
అయోధ్యగానూ పేర్లు మార్చారు. వాటి తర్వాత ఇప్పుడు అలీగఢ్ హరిగఢ్‌గా మారనుంది.