ఒప్పందాన్ని పాకిస్తాన్ మరో ఉల్లంఘించి దారుణానికి తెగబడింది. సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ దళంపై పాక్ రేంజర్స్ కాల్పులు జరిపారు. ఆ దాడిలో ఓ భారత జవాను తీవ్రంగా గాయపడ్డాడు.
జమ్ము-కశ్మీర్‌లోని సాంబా జిల్లా రామ్‌గఢ్, ఆర్నియా సెక్టార్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
దాయాదుల దాడిలో గాయపడి తీవ్రంగ రక్తమోడుతున్న సైనికుడికి స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి అనంతరం మిలిటరీ హాస్పిటల్ కు తరలించారు.
పాక్ రేంజర్స్ రెచ్చగొట్టే చర్యలకు దిగడంతో పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని బీఎస్ఎఫ్ జమ్ము విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.
గత అర్ధారాత్రి దాటిన తర్వాత, బీఎస్ఎఫ్ ట్రూపులు, పాక్ రేంజర్ల మధ్య తీవ్రమైన ఎదురుకాల్పులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. పాకిస్తాన్ దుందుడుకు వైఖరి, ఉసిగొల్పే చర్యలతో ఆందోళన చెంది నివాసాల నుంచి బయటకు వచ్చేందుకు భయపడ్డామన్నారు.
సుమారు ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఘటన చోటుచేసుకుందని విచారం వ్యక్తం చేశారు.
షోపియాన్ పరిధిలోని కథోహలెన్ ప్రాంతంలో ఈ ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పుల ఘటనలో ఓ ముష్కరుడు హతమయ్యాడు.
ద రిసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) తో ముష్కరుడు సంబంధాలు కలిగి ఉన్నాడని సైన్యం వెల్లడించింది. అతడి నుంచి ఆయుధాలు, పేలుడు సామగ్రితో పాటు ఇతర నిషేధిత పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోందని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు.