CBI inquiry against
Mahua Moitra
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వ్యవహారంపై
సీఐడీ విచారణ జరగనుంది. లోక్‌సభలో ప్రశ్నలు అడగడానికి లంచాలు తీసుకున్నట్లు మహువా ఆరోపణలు
ఎదుర్కొంటున్నారు. ఆమెపై సీఐడీ విచారణకు లోక్‌పాల్ ఆదేశించారు. ఈ విషయాన్ని బీజేపీ
ఎంపీ నిశికాంత్ దూబే ‘ఎక్స్’లో పోస్ట్ చేసారు.
‘‘నేను చేసిన ఫిర్యాదు ఆధారంగా, మహువా మొయిత్రా
అవినీతిపై లోక్‌పాల్ సీబీఐ విచారణకు ఆదేశించారు. ఆమె అవినీతి జాతీయ భద్రతకు సైతం
భంగకరంగా నిలిచింది’’ అని నిశికాంత్ దూబే ట్వీట్ చేసారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పారిశ్రామికవేత్త
అదానీకి వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి మహువా మొయిత్రా మరో
వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి లంచాలు తీసుకున్నారని నిశికాంత్ దూబే
ఆరోపించారు. ఆమె తన పార్లమెంటరీ లాగిన్ ఐడీని కూడా దర్శన్‌తో పంచుకున్నారనీ, అది
జాతీయ భద్రతకు భంగకరమని కూడా నిశికాంత్ దూబే వాదించారు. మహువా మొయిత్రాను తక్షణం
పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయాలంటూ నిశికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను
డిమాండ్ చేసారు.
దర్శన్ హీరానందానీకి పార్లమెంటరీ ఐడీ
ఇచ్చినట్టు మహువా మొయిత్రా ఇప్పటికే అంగీకరించారు. అయితే పార్లమెంటు ఎథిక్స్ కమిటీ
విచారణకు హాజరవడానికి ముందు, అసలు తనను విచారించే అధికారం ఎథిక్స్ కమిటీకి లేనే
లేదంటూ మహువా వాదించారు.