అంతర్జాతీయ
క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు అగ్రస్థానాలు( TOP PLACES) కైవసం చేసుకున్నారు. బ్యాటింగ్‌లో భారత యువఆటగాడు
శుభ్‌మన్ గిల్(Shubman Gill) మొదటి స్థానాన్ని
కైవసం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో
ఉన్న పాకిస్థాన్
కెప్టెన్ బాబర్ అజామ్‌ను రెండోస్థానానికి నెట్టేశాడు.
భారత్ నుంచి ఇప్పటి వరకు ఈ ఘనత సాధించిన వారిలో సచిన్, ధోని, విరాట్ కోహ్లీ ఉన్నారు.
ప్రపంచకప్ టోర్నీలో ఆరు మ్యాచుల్లో
ఇప్పటి వరకు 219 పరుగులు చేసిన శుభమన్ గిల్ 830 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, బాబర్ అజామ్ (824 పాయింట్లు) సెకండ్ ప్లేస్ కు
పడిపోయాడు.
క్వింటన్ డికాక్ (771), విరాట్ కోహ్లీ (770),
డేవిడ్ వార్నర్ (743) తర్వాతి స్థానాల్లో
నిలిచారు.
శ్రేయస్ అయ్యర్ కూడా 17స్థానాలు ఎగబాకి 18వ ర్యాంక్ సాధించాడు. ఆప్ఘన్ ఓపెనర్
జద్రాన్ ఆరు స్థానాలను మెరుగుపర్చుకుని 12వ
స్థానంలో చోటు సాధించాడు.
దక్షిణాఫ్రికా, శ్రీలంకపై మ్యాచుల్లో వికెట్లు తీసిన
పేసర్ మహమ్మద్ సిరాజ్ (709 పాయింట్లు) అగ్రస్థానంలోకి
దూసుకొచ్చాడు. తర్వాతి స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (694) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఆసీస్
స్పిన్నర్ ఆడమ్ జంపా (662 పాయింట్లు) మూడో స్థానంలోఉండగా.. కుల్దీప్
(661), షహీన్ అఫ్రిది (658) నాలుగైదు ర్యాంకుల్లో నిలిచారు.
బంగ్లాదేశ్
కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (327
పాయింట్లు) ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.