వైసీపీ
ఎంపీ విజయసాయిరెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీశర్మ తీవ్ర విమర్శలు
చేశారు. ప్రజాధనాన్ని దోచుకుంటూ నీతులు చెప్పడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు బీజేపీ
రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరిపై విమర్శలు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు.
బీజేపీ
ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని
దుయ్యబట్టారు. వైసీపీ అసమర్ధ పాలనతో దేశంలో రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చిందన్నారు.
రాష్ట్రప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకు మహిళా నేత గురించి ఇష్టానుసారం
మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
అవినీతికి
పాల్పడలేదని చెప్పే ధైర్యం ఉందా అని విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. మరోసారి
నోరుపారేసుకుంటే తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
ప్రతిపక్షాల
ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సన్నారెడ్డి దయాకర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఎత్తిచూపితే
తమ నేతలపై వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు.