తెలంగాణలో జనసేన బీజేపీ (janasena bjp ts list) పొత్తు ఖరారైంది. తెలంగాణలో జనసేనకు 8 సీట్లు కేటాయించారు. దీంతో తెలంగాణలో బీజేపీ, జనసేన సీట్ల పంపకం పూర్తైంది. రెండు రోజుల కిందటే జనసేనలో చేరిన ఇద్దరికి టికెట్లు కేటాయించారు. కూకట్‌పల్లికి చెందిన ముమ్మూరెడ్డి ప్రేమ్ కుమార్ రెడ్డి టీడీపీ నుంచి జనసేనలోకి రెండు రోజుల కిందట చేరారు. ఇక కొత్తగూడెం కాంగ్రెస్ టికెట్ ఆశించిన లక్కినేని సురేందర్‌రావుకు అక్కడ నిరాశ ఎదురు కావడంతో గత నెలలో బీజేపీలో చేరారు. తాజాగా జనసేనలో జాయిన్ అయ్యారు.
హైదరాబాద్‌లోని కూకట్పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తాండూరు నుంచి నేమూరి శంకర్ గౌడ్, కోదాడ నుంచి మేకల సతీష్ రెడ్డి, నాగర్‌కర్నూలు వంగ లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం లక్కినేని సురేందర్‌రావు, వైరా నుంచి డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్, అశ్వారావుపేట ముయబోయిన ఉమాదేవి బరిలో నిలవన్నారు.