Nitish Kumar apologises
on controversial remarks
బిహార్‌లో జనాభా పెరుగుదల గురించి
మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం నాడు రాష్ట్ర శాసనసభలో చేసిన
వ్యాఖ్యలు వివాదానికి దారి తీసాయి. దాంతో ముఖ్యమంత్రి ఇవాళ క్షమాపణలు చెప్పారు. తన
వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు.
బిహార్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల
సందర్భంగా నిన్న సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహిళల విద్య గురించి వ్యాఖ్యలు
చేసారు. జనాభా పెరుగుదలను నియంత్రించడానికి మహిళా విద్య అవసరమని చెప్పారు. ఆ క్రమంలోనే,
మహిళలు చదువుకుంటే శృంగారంలో పాల్గొన్నా గర్భం దాల్చకుండా ఉండగలరని అన్నారు. తన
ప్రసంగంలో ముఖ్యమంత్రి, రాష్ట్రంలో గర్భధారణ రేటు గతేడాది 4.3శాతం ఉండగా ఇప్పుడు
2.9శాతానికి తగ్గిపోయిందని కూడా వెల్లడించారు.
మహిళల శృంగారం గురించి సీఎం చేసిన
వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ మండిపడింది. కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ నితీష్
కుమార్ మానసిక సుస్థిరత్వం కోల్పోయారని వ్యాఖ్యానించారు. నితీష్ వ్యాఖ్యలు
అభ్యంతరకరం, ఆయన మానసిక సంతులనం కోల్పోయారు. నితీష్ వ్యాఖ్యలకు తేజస్వి యాదవ్
మద్దతు పలకడం కూడా అభ్యంతరకరమే. నితీష్ కుమార్ ఇంక సీఎంగా ఉండడానికి పనికిరాడు.
ఆయన దేశ సంస్కృతిపై విషం కక్కుతున్నాడు. ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పి ఊరుకుంటే
సరిపోదు, రాజకీయాల నుంచి తప్పుకోవాలి’’
అని నిత్యానంద రాయ్ విరుచుకుపడ్డారు.
మరోవైపు, జాతీయ మహిళా కమిషన్ సైతం
స్పందించింది. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఆ నేపథ్యంలో
ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ బేషరతుగా క్షమాపణలు
చెప్పారు.