ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులను త్వరగా తేల్చేలా ఆదేశించాలంటూ జనసేన నేత హరిరామజోగయ్య వేసిన ప్రజా ప్రయోజన వ్యాఖ్యాన్ని హైకోర్టు స్వీకరించింది. హరిరామజోగయ్య వేసిన పిల్ కేసుకు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రతివాదులు సీఎం జగన్మోహన్రెడ్డి,సీబీఐ, సీబీఐ కోర్టుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హరిరామజోగయ్య తరపున సీనియర్ న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ ఈ కేసులో వాదనలు వినిపించారు.
జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించాలంటూ హరిరామజోగయ్య పిల్‌పై కొన్ని సవరణల అనంతరం కోర్టు విచారణకు తీసుకుంది. 2024 అసెంబ్లీ ఎన్నికలలోపే జగన్మోహన్రెడ్డి (ys jagan mohan reddy) అక్రమాస్తుల కేసును తేల్చేలా ఆదేశాలివ్వాలని హరిరామజోగయ్య పిటిషన్ వేశారు.