మానవ అక్రమ రవాణా కేసుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తోంది. ఏక కాలంలో 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు (NIA Raids) నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. జమ్మూలో నిర్వహించిన దాడుల్లో మయన్మార్‌కు చెందిన రోహింగ్యా ముస్లింను అరెస్ట్ చేశారు.
త్రిపుర, అస్సాం, పశ్చిమబెంగాల్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, హర్యానా, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. జమ్మూలోని బతిండి ప్రాంతంలోని మయన్మార్‌కు చెందిన రొహింగ్యా ముస్లిం జాఫర్ ఆలమ్‌ను తెల్లవారుజామును అరెస్ట్ చేశారు. మరో అనుమానితుడు పరారీలో ఉన్నాడని ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు.
మయన్మార్ వలసవాదులు నివశించే మురికివాడలే లక్ష్యంగా ఆ దాడులు నిర్వహించారు. పాస్ పోర్ట్ చట్టాన్ని ఉల్లంఘించడం, మానవ అక్రమ రవాణా కేసుల్లో నిందితులే లక్ష్యంగా దాడులు నిర్వహించారు. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.