ఇటీవల అమెరికాలో కత్తిపోట్లకు (crime news) గురైన ఖమ్మం విద్యార్థి వరుణ్‌రాజ్ చనిపోయాడు. అతని కుటుంబసభ్యులకు అమెరికాలోని ఆసుపత్రి వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో వరుణ్ ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా మామిళ్లగూడేనికి చెందిన వరుణ్ ఒకటిన్నర ఏడాది కిందట ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఇండియానా రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువు కొనసాగిస్తున్నాడు. అక్టోబరు 31న జిమ్ నుంచి ఇంటికి వెళుతుండగా ఓ దుండగుడు వరుణ్‌ను కత్తితో పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన వరుణ్‌ను స్థానిక పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి వరుణ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతూ వరుణ్ నిన్న మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మృతుడి తండ్రి మహబూబాబాద్‌లో ఉపాధ్యాయుడిగా చేస్తున్నాడు.