తెలుగు
రాష్ట్రాలకు వర్ష సూచన(RAIN
ALERT) ఉన్నట్లు వాతావరణ
శాఖ(IMD) తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రం,
లక్షద్వీప్ ప్రాంతం నుంచి బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుండటంతో దక్షిణ
భారతదేశంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ
తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు కూడా పడే అవకాశముందని
హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్
లోని పలు ప్రాంతాల్లో నిన్న వానలు పడ్డాయి. నేడు కూడా అల్లూరి సీతారామరాజు,
కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల,
అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి
వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ విభాగం ప్రకటించింది.
రానున్న
రెండు రోజుల పాటు తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్ నగర్, వికారాబాద్, నల్గొండ,
నారాయణపేట, ములుగు, వరంగల్, సూర్యాపేట, కొత్తగూడెం, మేడ్చల్ జిల్లాల్లో వానలు పడే
అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.