వన్డే క్రికెట్
వరల్డ్ కప్ పోరులో ఆస్ట్రేలియా జట్టు పసికూన ఆప్ఘన్ పై(Australia vs Afghanistan) నమ్మశక్యంకాని రీతిలో విజయం సాధించింది. ఆసీస్ జట్టు 91 పరుగులకే 7
వికెట్లు కోల్పోయిన దశలొ ఓటమి ఖాయం అనుకున్నారు. కానీ మ్యాక్స్‌వెల్ చెలరేగి ఆడి జట్టును విజయం వైపు
నడిపాడు. 128 బంతుల్లో డుబుల్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు.
మ్యాక్స్‌వెల్
కారణంగా ఈ మ్యాచ్ లో 46.5 ఓవర్లలో ఏడు
వికెట్లకు 293 పరుగులు చేసి విజయం సాధించింది.
మాక్స్
వెల్ కు స్ట్రయికింగ్ ఇస్తూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్ళడంలో కెప్టెన్ కమిన్స్
మెచ్చుకోదగిన పాత్ర పోషించాడు. అప్పడప్పుడు సింగిల్స్ తీస్తూ మాక్సీకి
స్ట్రయికింగ్ ఇచ్చాడు. కమిన్స్ 68 బంతులు ఆడి 12 పరుగులు చేశాడు.
ఆప్ఘన్ పై విజయం
తో ఆసీస్ సెమీస్ లోకి దూసుకెళ్ళింది. టోర్నీలో ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడి
ఆరింట్లో గెలిచిన కంగారూలు సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు.
మ్యాక్స్‌వెల్(Glenn Maxwell ) 33 పరుగుల వద్ద ఉన్నప్పుడు ముజీబ్ ఓ
క్యాచ్ మిస్ చేశాడు. ఆ తప్పిదం
మ్యాచ్ స్వరూపాన్నేమార్చి వేసింది. దీంతో భారత వెటరన్ క్రికెటర్ కపిల్ దేవ్ 1989లో
నెలకొల్పిన రికార్డును మ్యాక్స్ వెల్ బద్దులు కొట్టాడు.
ఆస్ట్రేలియాలో చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవడంతో సెమీస్ పట్టికలో నాలుగో స్థానం కోసం పోటీ
ఎక్కవగా ఉంది. పాకిస్తాన్, న్యూజీలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఈ స్థానం కోసం పోటీ పడుతున్నాయి. 8 మ్యాచ్‌లు ఆడి
నాలుగు చొప్పున గెలుపులతో సమానమైన పాయింట్లతో ఉన్నాయి. అయితే మెరుగైన రన్‌రేట్
కారణంగా న్యూజీలాండ్ 4వ స్థానంలో ఉండగా పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ ఈ తర్వాతి
స్థానాల్లో ఉన్నాయి.
ఈ జట్లు గ్రూపు దశలో ఈ మూడు ఒక్కొక్క మ్యాచ్ ఆడాల్సి
ఉంది. సాధించే విజయాన్ని బట్టి 3 జట్లకూ సెమీఫైనల్ అవకాశం ఉంది. ఒకవేళ మూడు జట్లూ తమ చివరి
మ్యాచ్‌లలో గెలిస్తే 10 పాయింట్లతో మళ్లీ సమానంగానే ఉంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్
ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.