తెలంగాణలోని మహబూబ్‌నగర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సీఐ ఇఫ్తేకార్ అహ్మద్‌పై ఓ కానిస్టేబుల్ దాడి చేసి తీవ్రంగా గాయపరచిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి సీఐ అహ్మద్‌పై దాడి జరిగింది. గురువారం ఉదయం మర్లు – పాలకొండ రహదారిలో తలకు,కీలక శరీర భాగాలకు తీవ్రగాయాలై కారులో పడిఉన్న అహ్మద్‌ను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తరవాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినా ప్రయోజనం దక్కలేదు. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీఐ అహ్మద్ మంగళవారం చనిపోయాడని పోలీసులు తెలిపారు.
మెదడులో రక్తం గడ్డ కట్టిందని, వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించినా ఫలితం దక్కలేదని తెలుస్తోంది. మహబూబ్‌నగర్ డీఎస్పీ మహేశ్, గ్రామీణ సీఐ స్వామి
మృతదేహానికి పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇఫ్తేకార్ అహ్మద్ కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు (crime news)లో నిందితుడిగా భావిస్తోన్న కానిస్టేబుల్ దంపతులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. మహిళా కానిస్టేబుల్ ఇంట్లో సీఐ అహ్మద్ ఉండగా ఈ దాడి జరిగిందని అనుమానిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.