క్రికెట్ వరల్డ్
కప్(CWC-2023) టోర్నీలో భాగంగా నేడు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్(Australia Afghanistan) జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖెడే
స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్
బ్యాటింగ్ ఎంచుకుంది.
రహమానుల్లా
గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. జోష్ హజల్ వుడ్ వేసిన 7.6 బంతికి రహమానుల్లా ఔట్
అయ్యాడు. 25 బంతుల్లో 21 పరుగులు చేసి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. రహమత్ షా
క్రీజులోకి వచ్చాడు. ఇబ్రహీం జద్రాన్ 62 బంతుల్లో అర్ధ శతకం కొట్టాడు.18 ఓవర్లకు
ఒక వికెట్ నష్టోయి 93 పరుగులు చేసింది. 24.4 బంతికి రహమత్ షా(30) వద్ద ఔట్
అయ్యాడు. మాక్స్వెల్ బోలింగ్లో హజల్వుడ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
25
ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. 37.2 బంతికి
హషమత్ షాహిది 43 బంతుల్లో 26 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ వేసిన
బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి ఔట్ అయ్యాడు.
40 ఓవర్లకు
మూడు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
ఆడమ్ జంపా
వేసిన 42.3 బంతికి ఆజ్మత్ ఓమర్జా అవుట్
అయ్యాడు.
43.6
బంతిని ఆడి జద్రాన్ సెంచరీ పూర్తి చేశాడు.
45.3 బంతికి మహ్మద్ నబీ, హాజల్ వుడ్ బౌలింగ్ లో
బౌల్డ్ అయ్యాడు. 47 ఓవర్ ముగిసే సరికి ఆప్ఘన్ 252 పరుగులు
చేసింది. ఈ ఓవర్ లో 16 రన్స్ రాబట్టింది. 49 వ ఓవర్ లో 14 పరుగులు వచ్చాయి.
జద్రాన్ 129 పరుగులతో నాటౌట్ గా ఉండగా, రషీద్ ఖాన్ 18 బంతుల్లో 35 పరుగులు
చేసి అజేయంగా నిలిచాడు.
నిర్ణీత 50
ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఆసీస్ ముందు 292 పరుగులు
లక్ష్యాన్ని ఉంచింది.
మిచెల్
స్టార్క్, గ్లెన్ మాక్స్ వెల్, ఆడమ్ జంపా తలా ఒక వికెట్ తీశారు. జోష్ హజల్ వుడ్ రెండు
వికెట్లు పడగొట్టాడు.
టోర్నీలో
ఇప్పటివరకు ఆసీస్ జట్టు 7 మ్యాచ్ లు
ఆడి ఐదింట్లో విజయం సాధించింది. 10 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఆఫ్ఘన్ జట్టు ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడి 4 విజయాలతో ఆరోస్థానంలో ఉంది.