Nitish proposes to
increase reservations in Bihar to 75pc
బిహార్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో,
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఈబీసీలకు రిజర్వేషన్లను
65శాతానికి పెంచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రతిపాదించారు. కేంద్రప్రభుత్వం
తప్పనిసరి చేసిన 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌తో
కలుపుకుంటే మొత్తం 75శాతం రిజర్వేషన్లు అవుతాయి.
కొత్త ప్రతిపాదన ప్రకారం ఎస్సీల రిజర్వేషన్
20శాతం చేయాలి. బీసీలు, ఈబీసీలకు కలిపి 43శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. గతంలో ఉన్న
30శాతం కంటె ఇది చాలా ఎక్కువ. ఎస్టీలకు 2శాతం రిజర్వేషన్ ప్రతిపాదించారు. ప్రస్తుతం
బీసీలకు 12శాతం, ఈబీసీలకు 18శాతం, ఎస్సీలకు 16శాతం, ఎస్టీలకు 1శాతం రిజర్వేషన్లు
అమలవుతున్నాయి.
బిహార్ కులగణన రెండో దశతో కలిపి మొత్తం
నివేదికను ఇవాళ రాష్ట్ర శాసనసభకు సమర్పించారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి నితీష్ కుమార్
ఈ ప్రతిపాదన చేసారు.
రాష్ట్రంలోని బీసీల్లో
యాదవులది మెట్టువాటా. రాష్ట్ర జనాభాలో వారు 14.27శాతం ఉన్నారు. ప్రస్తుతం
ఉపముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వియాదవ్, అతని తండ్రి-మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్
యాదవ్ ఈ కులానికి చెందినవారే. ప్రస్తుత కులగణనలో యాదవులు, ముస్లిముల జనసంఖ్యను
చాలా ఎక్కువ చేసి చూపించారని బీజేపీ ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలను తేజస్వి యాదవ్ త్రోసిపుచ్చారు.