విజయవాడ
ఆర్టీసీ బస్టాండులో సోమవారం జరిగిన బస్సు ప్రమాదంపై దర్యాప్తు కమిటీ నివేదిక
అందజేసింది. డ్రైవర్‌కు సరైన శిక్షణ ఇవ్వకుండానే బస్సు అప్పగించినట్లు రవాణా శాఖ
అధికారులు నిర్వహించిన దర్యాప్తు కమిటీ విచారణలో తేలింది.
బస్సులోని ఆటోమేటిక్ గేర్ సిస్టమ్‌పై డ్రైవర్‌కు
సరైన అవగాహన లేదని, అందువల్లే ప్రమాదం జరిగిందని
దర్యాప్తు కమిటీ తేల్చింది. ఈ మేరకు రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులకు నివేదిక అందజేసింది.
దర్యాప్తు బృందం అందజేసిన నివేదికలోని అంశాలపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
సమీక్ష నిర్వహించారు.
విజయవాడ
పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో ఓ బస్సు ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్ళింది. దీంతో
ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఆటోనగర్ డిపోకు చెందిన బస్సును
డ్రైవర్ రివర్స్ చేసేందుకు ప్రయత్నించగా
అది అదుపు తప్పి ముందుకు దూసుకెళ్ళింది. దీంతో ప్లాట్‌ఫాంపై ఉన్న వ్యక్తుల్లో ముగ్గురు
మరణించారు.
మృతుల
కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్థిక సాయం, ఆర్టీసీ మరో రూ. 5 లక్షల
పరిహారాన్ని అందజేయనున్నట్లు ప్రకటించాయి. ప్రమాద ఘటనపై సమగ్ర వివరాలు కోరుతూ
ఆర్టీసీ ఉన్నతస్థాయి కమిటీతో విచారణకు ఆదేశించింది. దీంతో నేడు దర్యాప్తు అనంతరం
నివేదికను ఆర్టీసీ ఎండీకి అందజేశారు.