వన్డే
క్రికెట్
ప్రపంచకప్‌లో (World
Cup 2023) బంగ్లాదేశ్‌తో
జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ తొలిసారి ‘టైమ్డ్
ఔట్’గా పెవిలియన్‌కు చేరడంపై
పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తన అప్పీల్ ను బంగ్లా కెప్టెన్ సమర్థించుకుంటుండగా,
శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
తానేమీ
తప్పు చేయలేదని, బ్యాటింగ్ కోసం రెండు
నిమిషాల్లోపే సిద్ధమయ్యానని అదే విషయం అంపైర్లకు వివరించినట్లు మాథ్యూస్ చెబుతున్నారు. రెండు నిమిషాల్లోపు
సిద్ధంగా ఉండకపోతే ఔటని నిబంధనలు చెబుతున్నాయన్న మాథ్యూస్ అప్పటికీ ఇంకా ఐదు సెకన్ల సమయం మిగిలే ఉందన్నారు.
బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ మాత్రం
ఏమాత్రం చింతించడం లేదన్నారు. . టైమ్డ్ అవుట్‌పై అప్పీలు చేసినందుకు తానేమీ
పశ్చాత్తాపం పడడం లేదని తేల్చి చెప్పాడు. ఫీల్డర్లలో ఒకరు వచ్చి అప్పీల్ చేస్తే
మ్యాథ్యూస్ అవుటవుతాడని చెప్పాడని,
అదే చేశానని పేర్కొన్నాడు.
తన అప్పీలుకు అంపైర్లు సీరియస్‌గానే చేస్తున్నావా? అని అడిగితే అవునని
అన్నానని పేర్కొన్నాడు. అది తప్పా?
ఒప్పా? అనేది పక్కన పెడితే రూల్స్‌లో ఉంది కాబట్టే అప్పీల్ చేశానంటున్నాడు.
జట్టు ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయం
తీసుకోవడానికైనా తాను సిద్ధంగా ఉంటానని,
ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోబోనన్నారు.